స్టాండింగ్‌ కమిటీలో 11 ఎజెండా అంశాలకు ఆమోదం

నవతెలంగాణ-సిటీబ్యూరో
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో 11 అంశాలకు ఆమోదం లభించింది. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సమావేశంలో కమిషనర్‌ డీ.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులు శాంతి సైజెన్‌ శేఖర్‌, సయ్యద్‌ మిన్హా జుద్దీన్‌, సయ్యద్‌ సోహెల్‌ ఖాద్రి, సమీనా బేగం, అబ్దుల్‌ వాహెబ్‌, మహమ్మద్‌ అబ్దుల్‌ ముక్తాదర్‌, మహమ్మద్‌ మాజీద్‌ హుస్సేన్‌, వనం సంగీత యాదవ్‌, పండాల సతీష్‌ బాబు, ఇ.ఎస్‌. రాజ్‌ జితేంద్ర నాథ్‌, టి. మహేశ్వరి పాల్గొన్నారు.
ఆమోదం పొందిన ఎజెండా
రోడ్‌ నెం.92 జూబిహిల్స్‌ నుంచి రోడ్‌ నెం.12 బంజారా హిల్స్‌ వరకు ఆర్‌.డీ.పీ. కింద 18 మీటర్ల లింక్‌ రోడ్డు వెడల్పునకు మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చుట, ప్రభుత్వ ఆమోదానికి సిఫార్స్‌తో పాటుగా 15 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం తెలిపింది.
– ఎల్బీనగర్‌ జంక్షన్‌ కు తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత చారి జంక్షన్‌ గా నామకరణం కోసం ప్రభుత్వానికి సిఫార్స్‌ చేయగా వెంటనే మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివద్ధి శాఖ ద్వారా గత ఏప్రిల్‌4న ప్రభుత్వ ఉత్తర్వు 54ను జారీ చేసినందున కమిటీ ఆమోదం లభించింది.
– ఎస్‌.ఆర్‌.డీ.పీ ద్వారా నిర్మించిన ఎల్బీనగర్‌ ఆర్‌.హెచ్‌.ఎస్‌ ఫ్లైఓవర్‌ కు మాల్‌ మైసమ్మ ఫ్లైఓవర్‌గా నామకరణం చేసేందుకు మున్సిపల్‌ పరిపాలన పట్టణాభివద్ధి శాఖ ద్వారా ప్రభుత్వ ఉత్తర్వు 53ను జారీ చేసినందున కమిటీ ఆమోదం తెలిపింది.
– రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం గాజుల రామారం గ్రామం పెరికి చెరువు వద్ద డ్రయినేజీ డైవర్షన్‌ను రూ.3కోట్ల వ్యయంతో నిర్మించేందుకు పరిపాలన ఆమోదంతో పాటు టెండర్‌ అనుమతికి కమిటీ ఆమోదించింది.
– జీహెచ్‌ఎంసీ ఐటీ సెక్షన్‌ ద్వారా కాల్‌ సెంటర్‌ (040-2111 1111) నిర్వహణ జీ.వీ.కే. – ఇ.ఎం.ఆర్‌.ఐ ద్వారా 2023 జూన్‌ 1 నుంచి 2026 మే 31 వరకు మూడు సంవత్సరాల పాటు నిర్వహించేందుకు ఇ.ఎం.ఆర్‌.ఐ గ్రీన్‌ హెల్త్‌ సర్వీసెస్‌ కు రూ. 2,27,02,061 ఇచ్చేందుకు పరిపాలన ఆమోదానికి కమిటీ ఆమోదం లభించింది.
– కూకట్‌ పల్లి జోన్‌ కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ జీడిమెట్ల వార్డు నెం.132, పేట్‌ బషీరాబాద్‌లో అపర్ణ కన్స్ట్రక్షన్‌ అండ్‌ ఎస్టేట్‌ ప్రయివేటు లిమిటెడ్‌ ద్వారా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బీలీటీ ద్వారా రోడ్డు నిర్మించేందుకు కూకట్‌ పల్లి జోనల్‌ కమిషనర్‌తో ఎం.ఓ.యు చేసుకొనుటకు కమిటీ ఆమోదించింది.
– శేరిలింగంపల్లి జోన్‌ యు.బి.డి ద్వారా సెంట్రల్‌ మీడియన్స్‌/ ట్రాఫిక్‌ ఐల్యాండ్‌లను ‘ఐఐఐటీ’ జంక్షన్‌ నుంచి రెడిజాన్‌ హౌటల్‌ (డి.ఎల్‌.ఎఫ్‌ ఎదురుగా) వరకు సీ..ఎస్‌.ఆర్‌ కింద డీ.ఎల్‌.ఎఫ్‌ ఫౌండేషన్‌కు 2023 మే 29 నుండి 2026 మే 28 వరకు మూడు సంవత్సరాల పాటు మెయింటెనెన్స్‌ చేయడానికి శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌తో ఎం.ఓ.యు చేసుకొనేందుకు కమిటీ అనుమతించింది.
– రోడ్‌ డెవలప్‌ మెంట్‌ప్లాన్‌ కింద 30మీటర్లు, 18 మీటర్ల రోడ్డు వెడల్పు కోసం కొండాపూర్‌ జంక్షన్‌ నుంచి పోలీస్‌ కాలనీ వరకు, 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు సఫారీ నగర్‌ నుంచి కొండాపూర్‌ జానీ మజీద్‌ వయా హెచ్‌.టి లైన్‌ పోలీస్‌ గ్రౌండ్‌ వరకు పొడగించేదుకు 43 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదించారు.
– ఆర్‌.డీ.పీ కింద 30మీటర్ల రోడ్డును 48 మీటర్ల వెడల్పునకు పొడిగించి టీ.వీ టవర్‌ జంక్షన్‌ మూసారాంబాగ్‌ నుంచి అలీ కేఫ్‌ జంక్షన్‌ (1.4 కిలోమీటర్ల పొడవు), మూసి రివర్‌ అంబర్‌ పేట్‌ కాజ్‌ వే (0.6 కిలోమీటర్ల) 48 మీటర్ల వెడల్పు నకు మొత్తం 109 ఆస్తుల సేకరణకు కమిటీ ఆమోదం తెలిపింది.
– ఆర్‌.డీ.పీి కింద టీ.కే.ఆర్‌ కమాన్‌ నుంచి నాగార్జున సాగర్‌ రోడ్‌ వయా జెడ్‌పీ రోడ్‌ వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు 282 ఆస్తుల సేకరణకు అమోదం లభించింది.
– సికింద్రాబాద్‌ జోన్‌ బేగంపేట్‌ సర్కిల్‌ దనియాల గుట్టలో మహాపరినిర్వాన (గ్రేవ్‌ యార్డ్‌)ను ఆపరేషన్‌, మెయింటెనెన్స్‌ కోసం మహాప్రస్థానం ట్రస్ట్‌కు ఐదు సంవత్సరాల పాటు సీ.ఎస్‌.ఆర్‌. కింద నిర్వహించేందుకు కమిటీ అనుమతించింది.
ఈ సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు ప్రియాంక అలా, ఇ.ఎన్‌.సి జియా ఉద్దీన్‌, సిసిపి దేవేందర్‌ రెడ్డి, సి.ఇ దేవానంద్‌, అడిషనల్‌ కమిషనర్‌ విజయలక్ష్మి, జయరాజ్‌ కెనడీ, జోనల్‌ కమిషనర్లు మమత, పంకజ, రవికిరణ్‌, శంకరయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, సామ్రాట్‌ అశోక్‌, హౌసింగ్‌ ఓ.ఎస్‌.డి. సురేష్‌, చీఫ్‌ ఎగ్జామినర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ డా.రాంబాబు పాల్గొన్నారు.

Spread the love