ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి…

రోజురోజుకూ భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటోంది. ఉదయం నుంచే వేడి అల్లాడిస్తోంది.
ఇక మధ్యాహ్న సమయం గురించి చెప్పాల్సిన పని లేదు.
ఎండ వేడిని తట్టుకోవాలంటే ఈ పరిస్థితిలో తీసుకునే ఆహారంలో తప్పకుండా జాగ్రత్తలు పాటిం చాలి.
బలమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని రక్షించు కోవచ్చు…
రోజువారీ భోజనం తో పాటు పండ్లు, ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీర తాపానికి చెక్‌ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

– ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగడం వల్ల ఫలితం ఉంటుంది.
– రెండుసార్లు కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి.
– స్పూన్‌ మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవాలి.
– వ్యాయమం చేసిన తర్వాత ద్రాక్షలను తీసుకుంటే అలసిపోయిన శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. అలసటలో ఉన్న శరీరానికి ద్రాక్ష వెంటనే ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
– పుదీనా, కీరా దోసకాయ, పెరుగు, లస్సీ వంటివి తీసుకోవడం వల్ల శరీర వేడి తగ్గుతుంది. మజ్జిగను తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
– గ్లాస్‌ గోరువెచ్చని పాలల్లో తేనె కలుపుకొని రోజూ తాగితే చాలా మంచిది.
– గసగసాలను పొడిచేసి వేడి పాలలో కలుపుకొని తాగాలి.
– పుచ్చకాయ, కర్బూజ వంటివి శరీరాన్ని చల్లబరుస్తాయి.
– లిచీ పండ్లలో విటమిన్‌-సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇన్‌ఫెక్షన్స్‌, వైరస్‌లతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తుంది. శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్‌ను సరఫరా చేసి అధిక బరువును కూడా తగ్గిస్తుంది.

Spread the love