తగ్గిస్తేనే మంచిది…

ప్రస్తుత వాతావరణంలో అందరూ ఆరోగ్యం విషయలో శ్రద్ధ తీసుకో వడం తప్పనిసరి… రోజువారీ తినే పదార్థాలలో కొన్ని ఎక్కువగా తీసుకోవల్సినవి ఉంటాయి. కొన్ని తక్కువగా తీసుకో వల్సినవి ఉంటాయి. అలాంటి వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. కొంత మందికి అన్నం తినేటప్పుడు పైన కొంచెం ఉప్పు చల్లుకుని కలుపు కుని తినే అలవాటు ఉంటుంది. కొన్ని సార్లు కూరల్లో ఉప్పు తగ్గితే తినే సమయంలో కలుపుకుని తింటుంటాం. కానీ ఉప్పును ఒక మోతాదులో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా సమస్యనే. అందువల్ల ఉప్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోతాదు మించిన ఉప్పుతో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా సన్నగిల్లుతుందని పరిశోధనల్లో వెల్లడైంది. ఒక వ్యక్తి రోజుకు ఐదు గ్రాములకు మించకుండా ఉప్పును వాడాలని సూచిస్తోంది. ఉప్పును అధికంగా వాడటం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదముంటుంది. ఇందులో ఉండే సోడియం క్లోరైడ్‌ వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా, గుండె జబ్బులకు కూడా దారి తీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో రోగనిరోధక కణానికి చెందిన అత్యంత సాధారణ రకం గ్రాన్యులోసైట్స్‌ పనితీరును దెబ్బతీస్తుంది. కాబట్టి ఉప్పును జాగ్రత్త వాడటం ఆరోగ్యకరం.

Spread the love