స్పెషల్‌ డ్రైవ్‌తో పారిశుధ్యం మరింత మెరుగు

మేయర్‌ నీలా గోపాల్‌ రెడ్డి
నవతెలంగాణ-దుండిగల్‌
నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో 10 రోజుల పాటు ప్రత్యేక పారిశుధ్య పనులతో మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అన్ని డివిజన్లలో పారిశుధ్యం మెరుగవుతుందని నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ నీలా గోపాల్‌ రెడ్డి తెలిపారు. శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ లో భాగంగా శుక్రవారం బచూపల్లి మెడికుంట చెరువు వద్ద శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు రాకుండా పారిశుధ్య పనులను సక్రమంగా జరిగే లా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ వాహనలను ప్రతీరోజు నడిపేలా చూడాలని, ఈరోజు నుంచి మే 27వ తేదీ వరకు నిర్వహి స్తున్న శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ లో రోడ్ల వెంబడి ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించి, డ్రయినేజీలను ఎప్పటి కప్పుడు శుభ్రపరుస్తూ సీజనల్‌ వ్యాధులకు దూరం ఉండాలంటే వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు తెలియజేయలని శానిటేషన్‌ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు , విజయ లక్ష్మి సుబ్బారావు , సీనియర్‌ నాయకులు వేంగయ్య చౌదరీ , బీఆర్‌ఎస్‌ ఎన్‌ఎంసీ యూత్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ గౌడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాము , 14వ డివిజన్‌ అధ్యక్షుడు బొబ్బా శ్రీనివాస్‌ రావు,16 వ డివిజన్‌ మహిళా అధ్యక్షురాలు రజిత రెడ్డి శానిటేషన్‌ అధికారులు అజీజ్‌ ఖాసీం , వినోద్‌ కుమార్‌ , సుకత , అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love