ఆశ వర్కర్లవి గొంతమ్మ కోర్కెలు కావు…!

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు
ఆశ వర్కర్లకు మద్దతు తెలిపిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

– దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు

నవతెలంగాణ దుబ్బాక రూరల్ 
ఆశ వర్కర్లవి గొంతెమ్మ కోర్కెలు కావని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. దుబ్బాక మండల కేంద్రంలో ఆశా వర్కర్లు చేపట్టిన నిరవధిక సమ్మె13వ రోజుకు చేరుకున్న సందర్భంగా వారికి ఎమ్మెల్యే మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటుందే కానీ వారీ బాగోగులు తెలుసుకోవడంలో విఫలమైందన్నారు. న్యాయ బద్ధంగా ఆశ వర్కర్లు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. కరోనా సమయంలో ప్రజలకు వారు చేసిన సేవలు మరువలేనివి పేర్కొన్నారు. ప్రాణాలు పనంగా పెట్టీ వారు సేవలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పట్టంచుకోకవడం అత్యంత బాధాకరం అన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు సుభాష్ రెడ్డి, మండల అధ్యక్షుడు అంబటి శివ ప్రసాద్,అక్బర్ పేట్ భూంపల్లి మండల అధ్యక్షులు అరిగే కృష్ణ, నాయకులు విబిషన్ రెడ్డి, చింత సంతోష్, సీఐటీయూ దుబ్బాక టౌన్ కన్వీనర్ భాస్కర్ తదితరులు ఉన్నారు
Spread the love