ఏపీ డీజీపీకి లేఖ రాసిన బాబు

నవతెలంగాణ –  హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న వేళ  రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని అందులో కోరారు. ఎన్నికల నామినేషన్ పక్రియలో అభ్యర్థి తనపై ఉన్న కేసుల వివరాలు పేర్కొనాల్సి ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా కేసుల వివరాలు దాచిపెడితే.. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తనపై నమోదైన కేసుల వివరాలు కోరినట్లు సమాచారం. అధికార పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదనే ముందుచూపుతో చంద్రబాబు ఏపీ డీజీపికి లేఖ రాశారు.

 

Spread the love