అంబరాన్నింటిన బాజిరెడ్డి జగన్ జన్మదిన సంబరాలు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
బీ
అర్ఎస్ యువ నాయకుడు, జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, ఒలింపిక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, దర్పల్లి జడ్పీ పిసి బాజిరెడ్డి జగన్ మోహన్ జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి. యువ నాయకుడు బాజిరెడ్డి జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆసుపత్రి, అనాధ శరణాలల్లో పండ్ల పంపిణీ, రక్తదానం చేసిన బీఅర్ఎస్ నాయకులు కార్యకర్తలు.సోమవారం రాత్రి నుండే ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నివాస గృహాం వద్ద డిచ్ పల్లి,ఇందల్ వాయి మండలాలకు చెందిన సర్పంచులు ఎంపిటిసిలు, జిల్లా, మండల, గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని కేక్ కటింగ్ చేసి సంబురాలను ఘనంగా నిర్వహించారు.డిచ్ పల్లి మండల కేంద్రంలోని శ్రీ కాశీ విశ్వనాధేశ్వరుని ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, తనయుడు బాజిరెడ్డి జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వేద పండితులు బాజిరెడ్డి జగన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. బాజిరెడ్డి జగన్ సతీ సమేతంగా హాజరై శ్రీ కాశీ విశ్వనాధేశ్వరుని ఆలయంలో గల స్పాటిక లింగేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు రుద్రాభిషేకం చేశారు. అనంతరం బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొనీ కేక్ కట్ చేశారు. కార్యకర్తలు శాలువా పూల మాలలతో, ఘనంగా సన్మానించారు. డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, ఎంపిపి బాదవత్ రమేష్ నాయక్, జడ్పిటిసి దాసరి ఇందిరా లక్ష్మీ నర్సయ్య, సర్పంచులు మమత శేఖర్, తేలు విజయ్ కుమార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, సామాజిక కార్యకర్త పులి సాగర్,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండుగుల సాయిలు, మాజీ మండల అధ్యక్షుడు శక్కరి కొండా కృష్ణ, పిఎసిఎస్ చైర్మన్ గజవాడ జైపాల్, కో- ఆప్షన్ మెంబర్ షేక్ నయీమ్, మోహమ్మద్ యూసుఫ్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love