రక్తదానం ప్రాణదానం.. ప్రముఖ చాతి వైద్య నిపుణులు బొద్దుల రాజేంద్రప్రసాద్

నవతెలంగాణ – కంటేశ్వర్
రక్తదానం ప్రాణదానమని ప్రముఖ చాతీ వైద్య నిపుణులు డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆద్వర్యంలో బుదవారం ‌దివంగత జర్నలిస్టు విఠల్ వ్యాస్ తృతీయ వర్దంతి సందర్భంగా నిజామాబాదు రెడ్ క్రాస్ లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ రాజేంద్రప్రసాద్ హాజరై ప్రసంగించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు..ఆరోగ్య వంతులైన ప్రతి ఒక్కరూ మూడు నెలలకోసారి రక్తదానం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా 10 మంది యువకులు రక్తదానం చేశారు.. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, ఆర్అండ్ బిడీఈ శ్రీమన్నారాయణ, నిజామాబాదు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బైర శేఖర్, టియూడబ్ల్యూ జై జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, లయన్స్ క్లబ్ కార్యదర్శి చింతల గంగాదాస్, విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ గౌరవాద్యక్షులు జమాల్పూర్ గణేష్, అద్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, జమాల్పూర్ ఈశ్వర్, జర్నలిస్టులు పాకాల నర్సింలు, ఏఎస్ సాంబయ్య, ఇంజమూరి మధు, సాయిప్రసాద్, ప్రమోద్ గౌడ్, కిషోర్, రాజేష్, బాలకుమార్, సిరిగాద ప్రసాద్, శివ, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love