నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తూ జీవో ఇవ్వడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు. ఆదివారం ఈమేరకు పలువురు మైనార్టీ నేతలు ఫిరోజ్ ఖాన్, ఫైజల్ ఖాన్, ఫసిఖాన్, అయాన్ ఖాన్, అక్బర్, జాఫర్ పటేల్, సాజిద్, తదితరులు ఆయనకు కతజ్ఞతలు తెలిపారు.
చదువుల తల్లులకు ‘గిప్ట్ ఏ స్మైల్’
తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్
పేదరికంతో చదువుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఇద్దరు విద్యార్ధినీలకు ‘గిప్ట్ ఏ స్మైల్’లో భాగంగా ఆర్థిక సాయం చేసినట్టు తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పేద విద్యార్థినీలకు చెక్కులు అందజేసినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంజీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చదువుతున్న కొమ్ము కిష్టయ్య కుమార్తె సుమతికి, మీర్‌పేట్ టీకెేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మల్లెపాక రాములు కుమార్తె శ్వేతకు చెరో లక్ష రూపాయల చొప్పున ఆయన ఆర్థిక సాయం అందజేశారు.