బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నేడు దుర్భరదుస్థితి.. 

– ప్రజలకు కాంగ్రెస్ శ్రేణుల సూచన 

– మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే వాఖ్యల ఖండన
నవతెలంగాణ-బెజ్జంకి 
బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇష్టారీతిన పదేండ్లు పరిపాలించి.. ప్రాజెక్టుల పేరునా ప్రజా ధనాన్ని లూటీ చేయడం వల్లే నేడ రాష్ట్రం దుర్భరదుస్థితిని ఎదుర్కొంటుందని కాంగ్రెస్ నాయకులు మానాల రవి,డీవీ రావు,మెట్ట నాగారాజు ఆరోపించారు.గురువారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ లక్ష్మిపూర్ గ్రామంలో కరీంనగర్ మాజీ ఎంపీ,మాజ ఎమ్మెల్యే బుధవారం దెబ్బతిన్న పంటల పరిశీలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చేసిన వాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు ఖండించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏర్పడిన కరువును కాంగ్రెస్ పార్టీయే కరువును పునారవృతం చేస్తుందని మాజీ ఎంపీ వాఖ్యలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు.పదేండ్ల పరిపాలనలో రైతు బందు,రైతు బీమా పేరునా రైతుల సమస్యలను విస్మరించి నేడు పంటల పరిశీలన పేరునా బీఆర్ఎస్ నాయకత్వం రైతులపై మొసలి కార్చుతున్నారని దుయ్యబట్టారు.బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వసనీయతను కొల్పోయి మళ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం కరువు అంశంతో రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నేరవెర్చుతుందని దీమా వ్యక్తం చేశారు.
Spread the love