గ్రామాలభివృద్ధికి బీఆర్‌ఎస్‌ కృషి

నవతెలంగాణ-ఆలేరు రూరల్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాఘవపురం గ్రామంలో ఎంఆర్‌ఆర్‌ నిధుల నుండి రూ.64 లక్షలతో కొలనుపాక గ్రామం నుండి రాఘవపురం గ్రామానికి బీటీి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టణాలకే బీటీ రోడ్లు ఏర్పాటు వేశాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం గ్రామాలభివద్ధికి కషి చేయడంలో ముందుంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గ్రామంలో ప్రతి గడపకూ చేరాయన్నారు. దేశానికి పట్టుగొమ్మల్లాగా గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బక్క రాంప్రసాద్‌ ,ఉప సర్పంచ్‌ పరిదే పద్మ, మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ ,గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్‌ ,మండల నాయ కులు పరిదే సంతోష్‌ ,మాజీ ఎంపీపీ స్వరూప ,మాజీ ఎంపిటిసి మామి డాల అంజయ్య, విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు భానుచందర్‌ నాయకులు వార్డు సభ్యులు మధ్యల నరేష్‌ ,ఆరె బాలరాజు, పాండు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love