ప్రోత్సహించాలి : దాసు సురేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ బీసీ కులవృత్తులను తగిన విధంగా ప్రోత్సహించటం లేదని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.. గొల్ల కురుమ, పాడి రైతులు నిర్వహించే పాల ఉత్పత్తులను అగ్రవర్ణాలు, కార్పొరేట్ శక్తులు దోచుకుంటుంటే ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరించటం తగదని పేర్కొన్నారు. పాల ఉత్పత్తులను రసాయనాలతో కలుషితం చేసి ప్రజల, పసిపిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా గొల్ల కురుమ యాదవులకు చెందాల్సిన సంపదను కార్పొరేట్ కు ప్రభుత్వం కట్టబెడుతున్నదని విమర్శించారు.ప్రభుత్వం నిర్వహించే విజయ పాల ఉత్పత్తులను ప్రోత్సహించకుండా ఇతర వ్యాపార సంస్థలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు.