ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరోసారి నోటీసులు

To MLC Kavitha in Delhi liquor scam CBI once again notices– ఈనెల 26న హాజరుకావాలని సమన్లు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు దర్యాప్తు సంస్థ మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ నెల 26 (సోమవారం) తమ ముందు హాజరుకావాలని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) సమన్లు జారీ చేసింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ లోని ఆమె ఇంటి అడ్రస్‌కు ఈ నోటీసులు అందినట్టు తెలిసింది. అలాగే మెయిల్‌ ద్వారా కూడా మరో సెట్‌ నోటీసులు అందించినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. అయితే ఏ సెక్టన్‌ కింద కవితకు సీబీఐ నోటీసులు పంపిదనేది తెలియాల్సి ఉంది. దీనిపై కవిత సైతం స్పందించాల్సి ఉంది. కాగా 2022, జూలై తరువాత మద్యం కుంభకోణం బహిర్గతం కాగా… దాదాపు ఐదు నెలల తరువాత డిసెంబర్‌ లో తొలిసారి సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఇప్పుడు దాదాపు మరో ఏడాది తరువాత తాజా సమన్లు ఇచ్చింది. అయితే సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు ఈ కుంభకోణం విచారణ చేస్తుండగా… 2022 డిసెంబర్‌ 11న తొలిసారి సీబీఐ కవితను హైదరాబాద్‌ లోని ఆమె నివాసంలో విచారించింది. సీఆర్పీసీ 160 ప్రకారం సాక్షిగా సుమారు ఏడు గంటలకు పైగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అనంతరం సీఆర్పీసీ 91 కింద ఈ కేసుకు సంబంధించిన ఏవైనా ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరుతూ నోటీసులు ఇచ్చింది.
నాలుగు నెలల తరువాత ఈడీ ఎంట్రీ…
సీబీఐ నోటీసులు ఇచ్చిన సరిగ్గా నాలుగు నెలల తరువాత గతేడాది మార్చి మొదటి వారం ఈ కేసులో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసుల్లో భాగంగా తొలిసారి మార్చి 11న మొదటిసారి కవిత ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఢిల్లీ అబ్దుల్‌ కలాం రోడ్‌ లోని ప్రవర్తన్‌ భవన్‌ లో (ఈడీ ప్రధాన కార్యాలయం) తొలిరోజు సుదీర్ఘంగా విచారించిన అధికారులు 16న హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

Spread the love