చంద్రముఖి 2.. అందర్నీ మెప్పిస్తుంది

Chandramukhi 2.. Everyone pleasesరాఘవ లారెన్స్‌ హీరోగా, బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రం ‘చంద్రముఖి 2′. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియర్‌ డైరెక్టర్‌ పి.వాసు తెరకెక్కించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా ఈనెల 28న ఈ సినిమా విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌పై రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం యువి మీడియా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రాఘవ లారెన్స్‌ మాట్లాడుతూ,’రజనీకాంత్‌ ఆశీస్సులతో ఈ సినిమా చేశాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చతుందని ఆశిస్తున్నాను. కంగనాతో నటించాలని అందరికీ డ్రీమ్‌ ఉంటుంది’ అని తెలిపారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్‌ చేస్తున్నాం. మొదటిపార్ట్‌ కంటే రెండవ పార్ట్‌ పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘మాకు ఈ సినిమాను ఇచ్చిన లైకా వారికి థ్యాంక్స్‌. కంగనా, లారెన్స్‌ మాస్టర్‌ ఈ సినిమా ఒప్పుకోవడం సంతోషంగా అనిపించింది. ఎన్వీ ప్రసాద్‌ ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్‌ చేయబోతున్నారు’ అని దర్శకుడు పి.వాసు చెప్పారు. కంగనా రనౌత్‌ మాట్లాడుతూ, ‘చంద్రముఖి అనే ప్రయాణం నాకు ఎంతో స్పెషల్‌. దర్శకుడు వాసుకి థ్యాంక్స్‌. లారెన్స్‌ మాస్టర్‌ని మిస్‌ అవుతాను. కీరవాణి మా సినిమాకు అతి పెద్ద బలం’ అని అన్నారు. ”చంద్రముఖి 2లో దెయ్యాన్ని చూపించకుండానే అంతలా భయపెట్టారు. మొదటి పార్ట్‌లో విద్యా సాగర్‌ ఓ మార్క్‌ సెట్‌ చేశారు. నా శక్తి మేరకు నేను పని చేశాను’ అని ఎం ఎం కీరవాణి చెప్పారు.

Spread the love