ఈ తరం మువతకు రోల్‌ మోడల్‌

For this generation A role modelటెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌, లెజెండరీ ఆఫ్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్‌ మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించింది. ఎంఎస్‌ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్‌ సంస్థ నిర్మాత శివలెంక కష్ణప్రసాద్‌ సమర్పణలో అక్టోబర్‌ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతోంది.
ఈ సందర్భంగా వీవీఎస్‌ లక్ష్మణ్‌ ముఖ్య అతిథిగా సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. బిగ్‌ టికెట్‌ ఆవిష్కరణ లక్ష్మణ్‌ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ‘మైదానంలో
మురళీధరన్‌ సాధించి నది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్‌. ఆయన గొప్ప క్రికేటరే కాదు.. మంచి మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్‌ మోడల్‌’ అని తెలిపారు.
‘లక్ష్మణ్‌ గొప్ప క్రికెటర్‌. నాకు క్లోజ్‌ ఫ్రెండ్‌.
మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ… మైదానం బయట సచిన్‌, అనిల్‌ కుంబ్లే, గంగూలీ స్నేహితులుగా ఉన్నాం’ అని ముత్తయ్య మురళీ ధరన్‌ చెప్పారు.
శివలెంక కష్ణప్రసాద్‌ మాట్లాడుతూ, ‘ఒక మనిషి జర్నీలో ఇంత ఎమోషన్‌ ఉంటుందా? అని ఆశ్చర్యపోయా. కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాలు ఎన్నో ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా నా లైఫ్‌లో ఒక మంచి మెమరీ’ అని అన్నారు.

Spread the love