మద్దతు ధరను పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలి

 – జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య,

– మద్నూరులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు ప్రారంభం
నవతెలంగాణ- మద్నూర్: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి పంట మద్దతు ధర కొనుగోలు కేంద్రాన్ని మండల కేంద్రంలోని గురు రాఘవేంద్ర ప్రైవేట్ పత్తి మిల్లు లో బుధవారం నాడు మార్కెటింగ్ శాఖ అధికారులు సీసీఐ అధికారులు పత్తి వ్యాపారులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి రమ్య మాట్లాడుతూ పత్తి రైతులు మద్దతు ధరను సద్వినియోగం పరుచుకోవాలని కోరారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి పంట క్వింటాలుకు మద్దతు ధర 7020 రూపాయలుగా ప్రకటించారు. పత్తి పంట రైతులు ప్రైవేటుగా అమ్ముకొని మోసపోకుండా ఎలాంటి కడతా లేకుండా మద్దతు ధర కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారితో పాటు సీసీఐ అధికారి ఓబుల్ రెడ్డి మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి విట్టల్ సూపర్వైజర్ సత్యం గురు రాఘవేంద్ర పత్తి మిల్లు యజమాని శశికాంత్ సెట్ పత్తి వ్యాపారులు పత్తి రైతులు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love