కార్మిక చట్టాలని కాలరాస్తున్న బీజేపీ నరేంద్ర మోడీని ఓడించండి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – భువనగిరి
కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో పది సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల ను 4 కోడ్ గా మారుస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుస్తూ కార్మికులకు మోసం చేస్తున్న నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని, కమ్యూనిస్టులు  పార్లమెంట్లో ప్రాదనిద్యం ఉంటేనే కార్మికుల చట్టాలను కాపాడగలుగుతుందని పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. ఇతర దేశాల్లో ఉన్న నల్ల ధనాన్నితీసుకువచ్చి ఒక్క కుటుంబానికి రూ.15 లక్షల  పంచుతానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, పది సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వవలసిన బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను కుదిస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ అంబానీ ఆదానికి  అప్పజెప్తున్నారని విమర్శించారు. వారి దగ్గర కమిషన్ తీసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక అంబానికి  రూ.14 లక్షల కోట్లు మాఫీ చేసి, పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు కోతలు  విధిస్తున్నారని తెలిపారు.  నిత్యవసర ధరలు పెంచుతూ సామాన్య నడ్డి విరుస్తూ నది అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని మార్పు చేయాలని ఇండియా కూటమి రావాలని కోరుతున్నామన్నారు.   భువనగిరిపట్టణంలో బాగా అయితే స్కూల్ నుండి ప్రారంభమై ధోబివాడ గంగపుత్ర వాడ, కామనీ కంతా, ఇంద్రానగర్, పోచమ్మ వాడ, నల్గొండ చౌరస్తా మీదుగా రాంనగర్ హౌసింగ్ బోర్డ్ ఇంటింటికి కరపత్రాలు పంచుతూ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలో బందెల ఎల్లయ్య వనం రాజు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కొత్త లక్ష్మయ్య దండు గిర చంద్రశేఖర్ కళాకారులు పాల్గొన్నారు.
Spread the love