అమెరికా ఆంక్షలపై క్యూబా జనాగ్రహం

– ఖండించిన సామాజిక కార్యకర్తలు
హవానా : దశాబ్దాల తరబడి క్యూబాపై విధిస్తున్న అమెరికా ఆంక్షలను జనాగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు అంతర్జాతీయ సామాజిక కార్యకర్తలు ఖండించారు. 20కి పైగా లాటిన్‌ అమెరికా, కరేబియన్‌, యూరోపియన్‌ దేశాలకు చెందిన 150 మందికి పైగా సామాజిక కార్యకర్తలు క్యూబాపై అమెరికా విధిస్తున్న ఆంక్షలను తీవ్రంగా ఖండించారు. వారంతా.. క్యూబాలో రోడ్లపై పోస్టర్లు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బొలీవియన్‌ శాసనసభ సభ్యుడు అమండా ఇరియార్టే ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రకటనలో ‘అమెరికా ఆంక్షల వల్ల ఔషధాలు, శాస్త్ర, సాంకేతిక విషయాల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో క్యూబాపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా విధిస్తున్న క్రిమినల్‌ విధానాలకు ముగింపు పలకాలి’ అని ఆ ప్రకటన పేర్కొంది. ఈ నేపథ్యంలో స్పానిష్‌కు చెందిన సామాజిక కార్యకర్త పోల్‌ ఇగ్లేసియాస్‌ మాట్లాడుతూ.. ‘అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా శాంతి, న్యాయం కోసం ప్రపంచంలో ఓ చిన్న ద్వీపం పోరాడుతుందని క్యూబాను సంకేతంగా చూపొచ్చు’ అని ఆయన అన్నారు.
కాగా, అధికారిక ప్రకటన ప్రకటరం జూలై 26వ తేదీన జరిగే మోన్‌కాడా గారిసన్‌పై దాడి ( క్యూబా విప్లవానికి నాందిగా పరిగణించబడుతుంది) జరిగిన 70వ వార్షికోత్సవ వేడుకులకు ఈ సామాజిక కార్యకర్తలు హాజరుకానున్నారు.

Spread the love