చెల్లిని తుపాకీతో కాల్చి చంపిన

మూడేండ్ల చిన్నారి..!
న్యూయార్క్‌. అమెరికాలో తుపాకీ సంస్కతికి మరో చిన్నారి బలైంది. గన్‌ అంటే ఏంటో తెలియని ఓ మూడేండ్ల చిన్నారి దాంతో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్‌ నొక్కింది. ప్రమాదవశాత్తూ జరిగిన ఈ ఘటనలో ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాన్‌ డియాగో కౌంటీ ఫాల్‌ బ్రూక్‌ లో మూడేండ్ల చిన్నారి తన ఏడాదిన్నర చెల్లితో కలిసి ఆడుకుంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న గన్‌ తీసుకుని ట్రిగ్గర్‌ నొక్కింది. దీంతో ఎదురుగా కూర్చున్న పాప తలలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Spread the love