అమూల్‌ గర్ల్‌ రూపకర్త డాచున్హా మృతి

న్యూఢిల్లీ : అమూల్‌ గర్ల్‌ రూపకర్త, డాచున్హా కమ్యూనికేషన్స్‌ ఛైర్మన్‌ సిల్వెస్టర్‌ డాచున్హా మంగళవారం రాత్రి మృతి చెందారు. అట్టర్లీ-బట్టర్లీ ప్రచారంలో తొలిసారిగా అమూల్‌ గర్ల్‌ కార్టూన్‌ను డాచున్హా గీశారు. అప్పటి నుంచి దీనికి ఎంతో పేరు వచ్చింది. భారీ కటౌట్లు, వాల్‌ పోస్టర్ల రూపంలో ప్రదర్శించడంతో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రకటనల సంస్థ ‘ఎఎన్‌పీ’లో మేనేజర్‌గా ఉన్న సమయంలో డాచున్హా ఈ బొమ్మ గీశారు. తరువాత ఆయన సొంతంగా డాచున్హా కమ్యూనికేషన్స్‌ను స్థాపించారు. సందర్భానుసారంగా పత్రికల్లో అమూల్‌ గర్ల్‌ కార్టూన్లు ఇవ్వడం డాచున్హా ప్రత్యేకత.

Spread the love