సర్పంచ్ పరిదే మమత
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి నెలకొంది.గ్రామ ప్రవేశ ద్వారం వద్ద 11 కేవీ విద్యుత్ లైన్ చాలా తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండటం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.ఈ లైన్‌కు వడ్ల లారీలు, రైతులు తీసుకెళ్లే గడ్డి తరచుగా తగులుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.ప్రస్తుతం ఈ పరిస్థితి వల్ల ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ముఖ్యంగా పంట కాలంలో భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ప్రమాదం ముప్పు మరింత ఎక్కువైందని పేర్కొంటున్నారు.ఈ సమస్యపై గ్రామ సర్పంచ్ పరిదే మమత పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణమే స్పందించి విద్యుత్ పోల్ ఏర్పాటు చేసి లైన్‌ను సురక్షిత ఎత్తులో ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రమాదకరంగా 11 కేవీ లైన్.. స్పందించని అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



