ఆగస్టు 15 నుండి కాంట్రాక్ట్ ఏఎన్ఎంల సమ్మెను జయప్రదం చేయండి..

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్

నవతెలంగాణ -కంటేశ్వర్
ఆగస్టు 15 నుండి కాంట్రాక్టు ఏఎన్ఎంలో సమ్మెను జయప్రదం చేయండి అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ కార్యాలయంలో ప్రెస్ మీట్ జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వము 1520 ఏఎన్ఎం పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దుచేసి ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్ట్ వారిని సీనియార్టీ ప్రకారంగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించామని అన్నారు. అలాగే జులై 31వ తేదీన సమ్మె నోటీసు కూడా ఇచ్చారు ఆగస్టు 15 నుండి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొని నోటీస్ ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచినియo అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదువేల మంది కాంట్రాక్ట్ ఏఎన్ఎం లందరూ ఆగస్టు 15 జండా ఆవిష్కరణల అనంతరం సమ్మెలోకి వెళుతున్నట్లుగా ప్రకటించి సమ్మెను ప్రారంభించాలని కోరారు.  వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. ఇటీవల కాలంలో మెడికల్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ అప్పుడు పరీక్ష లేకుండా రెగ్యులర్ చేశారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టులు ఏఎన్ఎంలు మేల్ హెల్త్ అసిస్టెంట్ల ను డైరెక్ట్ గా రెగ్యులర్ చేశారు.కానీ కాంట్రాక్ట్ ఏఎన్ఎం లో విషయం వరకు వచ్చేసరికి పరీక్ష విధానం పెట్టడం ఇది చాలా అన్యాయం. పరీక్ష విధానం రద్దుచేసి యధావిధిగా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు పుష్ప కవిత, సరోజ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love