బీహార్‌లో నాలుగులైన్ల వంతెన కూల్చివేత

– అదృశ్యమైన గార్డు
న్యూఢిల్లీ : బీహార్‌లో నిర్మాణ లోపాల వల్ల నాలుగు లైన్ల వంతెనను అధికారులు ఆదివారం కూల్చిశారు. బీహార్‌లోని భగల్‌పూర్‌లో అగువానీ సుల్తాన్‌గంజ్‌ గంజా అనే నాలుగులైన్ల బ్రిడ్జిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మి స్తోంది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణ లోపాల కారణంగా.. నిన్న (ఆదివారం) సాయంత్రం అధికారులు కూల్చివేశారు. ఇప్పటివరకు ఈ బిడ్జ్రి నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం 1700 కోట్లను ఖర్చుపెట్టింది. ఈ కూల్చివేత అనంతరం అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు న్నాయి. అందుకే ఈ బ్రిడ్జిని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఆ రాష్ట్ర డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘గత సంవత్సరం ఏప్రిల్‌ 30వ తేదీన ఈ బ్రిడ్జిలోని కొంత భాగం కూలిపోయింది. ఈ బ్రిడ్జి కూలిన తర్వాత నిర్మాణ విషయాల్లో అధ్యయనానికి నిపుణులైన ఐఐటీ రూర్కీని సంప్ర దించాం. దీనికి సంబంధించి తుది నివేదిక రావాల్సి ఉంది. కానీ నిర్మాణం లో తీవ్రమైన లోపాలున్నాయని నిపుణులు మాకు చెప్పారు. ఇప్పటికే హాని కలిగించే నిర్మాణ భాగాలను తొలగించాం’ అని ఆయన అన్నారు.కాగా, ఆదివారం సాయంత్ర బ్రిడ్జి కూల్చివేత అనంతరం వంతెన దగ్గర పనిచేస్తున్న గార్డు కనిపించకుండా పోయాడు. అతని కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెతుకుతున్నాయని పర్బాట్టా సర్కిల్‌ ఆఫీసర్‌ చందన్‌ కుమార్‌ తెలిపారు. ఇక ఈ ఘటనపై భగల్‌పూర్‌ మాజీ ఎంపీ సయ్యద్‌ షానవాజ్‌ హుస్సేన్‌ నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. బ్రిడ్జి కూల్చివేత ఘటనపై నితీష్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Spread the love