హైదరాబాద్ : ఇంటీరియర్‌లలో మూడు మిల్లిమీటర్ సన్నని స్లాబ్‌ల కోసం భారతదేశంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న స్టోన్‌లామ్ ఆర్కిటెక్చరల్ మెటీరియల్స్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. అత్యాధునిక మూడు మిల్లిమీటర్ల సన్నని పింగాణీ స్లాబ్‌లతో, హోటళ్లు, వాణిజ్య ప్రాంగణాలు, నివాస సముదాయాలు, హాస్పిటాలిటీ ప్రదేశాలలో సహా విస్తృత శ్రేణీ భవనాలలో బాహ్య ఫసడ్స్ క్లాడింగ్ కోసం స్టోన్‌లామ్ విభిన్నమైన పరిష్కారాన్ని అందిస్తుందని స్టోనెక్స్ గ్రూప్ మార్కెటింగ్ చీఫ్ సుశాంత్ పాఠక్ తెలిపారు. ఈ స్లాబ్‌లు ఆల్గే, శిలీంధ్రాలు, మోల్డ్, బ్యాక్టీరియా పెరుగుదలకు నిరోధకతను కలిగి ఉంటయని, థర్మల్ షాక్‌కు విశేషమైన ప్రతిఘటనను ప్రదర్శిస్తాయన్నారు.