న్యూఢిల్లీ : మార్గదర్శి చిట్ ఫండ్స్ నిధుల దారి మళ్లింపు కేసుపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో సంస్థ యజమానులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న తెలంగాణ హైకోర్డు ఉత్తర్వుల పై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్ విచారణ జరిపారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను పరిశీలన చేస్తామన్న సుప్రీంకోర్టు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ సహా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. అంతవరకూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మద్యం తర ఉత్తర్వులన్నీ అమల్లో ఉంటాయని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.