పదవుల కోసం పాకులాడొద్దు

– మనకు రాజ్యాంగం ఆక్సిజన్‌..ప్రజాస్వామ్యం భవిష్యత్తు
– కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే
న్యూఢిల్లీ : పదవుల కోసం వెంపర్లాడొద్దనీ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటంలో తమ పార్టీ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటిం చారు. ”రాజ్యాంగం మనకు
పదవుల కోసం పాకులాడొద్దు ఆక్సిజన్‌. ప్రజాస్వామ్యం మన భవిష్యత్తు. ప్రతి ఒక్కరూ అట్టడుగు స్థాయిలో నాయకత్వాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఒకరితో ఒకరు కయ్యానికి దిగొద్దు” అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విభాగాలకు ‘నాయకత్వ అభివృద్ధి మిషన్‌’పై పార్టీ జాతీయ వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించాలని నాయకులు, కార్యకర్తలను ఆయన కోరారు. పార్టీని బలోపేతం చేయడానికి తాము నిరంతరం కృషి చేస్తున్నామనీ, మీరు బలంగా లేకపోతే ముందుకు సాగలేమని అన్నారు. పార్టీలో గొడవలు పార్టీని బలహీనపరుస్తాయని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలలో తన ఓటమి కోసం బీజేపీకి సహరించినవారికి కూడా పార్టీ విజయం సాధించాలనే కోరికతో పార్టీ టికెట్లు ఇచ్చినట్టు ఖర్గే తెలిపారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ చింతన్‌ శిబిర్‌లో ” లీడర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌” ప్రకటించబడిందని ఖర్గే చెప్పారు.

Spread the love