డబుల్‌ ఇస్మార్ట్‌ షురూ..

రామ్‌, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ క్రేజీ కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రానుంది. డబుల్‌ మాస్‌, డబుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్‌, ఛార్మి నిర్మించనున్నారు. సోమవారం కోర్‌ టీమ్‌, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ లాంచ్‌ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఛార్మి క్లాప్‌ ఇవ్వగా, హీరో రామ్‌ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో ”ఇస్మార్ట్‌ శంకర్‌ అలియాస్‌ డబుల్‌ ఇస్మార్ట్‌’ అని రామ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది.
‘డబుల్‌ ది ఎంటర్‌టైన్‌మెంట్‌! డబుల్‌ ది యాక్షన్‌! డబుల్‌ ది మ్యాడ్‌నెస్‌! వి ఆర్‌ బ్యాక్‌ !! డబుల్‌ఇస్మార్ట్‌ మోడ్‌ ఆన్‌!’ అంటూ లాంచింగ్‌ ఈవెంట్‌లో ఫోటోలని రామ్‌ ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.
ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్‌ చాలా పెద్ద స్పాన్‌ ఉన్న కథ రాశారు. ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో, భారీ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్‌ని ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కంటే మాసియర్‌ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు పూరి జగన్నాధ్‌. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి పాన్‌ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి.

Spread the love