పర్యావరణ పరిరక్షనే మానవ మనుగడకు మూలం..

– ఇందూరు డిచ్ పల్లి ఎఫ్ పి ఓ చైర్మన్ మాచర్ల నాగయ్య
నవతెలంగాణ – డిచ్ పల్లి
పర్యావరణ పరిరక్షనే మానవ మనుగడకు మూలాధారమని, దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిందని, ముక్యంగా ప్రతి ఒక్కరు కూడా వాహనాలను వాడడం వల్లే పర్యావరణంలో మార్పులు వస్తున్నాయని ఇందూరు డిచ్ పల్లి ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ చైర్మన్ మాచర్ల నాగయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు కాలుష్యం విపరీతంగా పెరిగుతుందని, ముక్యంగా ప్రతి ఒక్కరు కూడా వాహనాలను వాడడం ఎక్కువైందని, గతంలో ఒకొక్క ఇంట్లో అరుదుగా బైక్, కార్ ఉండేవి కాదన్నారు. నేడు ప్రతి ఇంట్లో ఎందరు ఉంటే అందరికి ఒక్కటి లేదా రెండు వాహనాలు ఉన్నాయని, దాని వల్ల కాలుష్యం ఏర్పడుతుందన్నారు. ప్రజలు, యువకులు ఈ రోజుల్లో నడవడం పూర్తిగా మర్చిపోయారని పేర్కొన్నారు. మొదటగా ప్రతి ఒక్కరు నీటినీ, కరెంట్, పెట్రోల్, ఆహారం, పొదుపుగా వాడుకుంటూవనరులను భవిష్యత్తు తరాలకోసం మనం వాటిని అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. అందుకే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యత గా చెట్లు నాటాలని పిలుపు ఇచ్చారు. ముక్యంగా మందులులేని పంటలు పండించే విదంగా రైతులు ముందుకెళ్లాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఇందూరు డిచ్ పల్లి డైరెక్టర్స్ వేల్పూర్ బుమయ్య, బుమారెడ్డి, సిఈఓ అఖిల, అకౌంటెంట్ సాయినాథ్, రైతులు దేవస్వామి, దేశెట్టి సాయరెడ్డి, నర్సయ్య,సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love