అస్సోం వెళ్లిన ఈటల

– ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మతో ప్రత్యేక భేటీ
– తెలంగాణలోని తాజా పరిస్థితులపై చర్చ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర బీజేపీలో వరుస పరిణామాలను సిట్‌రైట్‌ చేసేందుకు ఆ పార్టీ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ఎన్నికల ముందు బండి సంజ రుని అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలనే నిర్ణయం నుంచి అధిష్టానం వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది. అదే సమయంలో బీజేపీలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈటల రాజేందర్‌ను సంతృప్తి పరచడంలో భా గంగా ఆయనకు ఎన్నికల సారథ్య బాధ్యతలు అప్పగించే యత్నం జరుగు తున్నట్టు, ఈ నెల 15న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో ప్రకటించను న్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఢిల్లీ నుంచి ఆ పార్టీ పెద్దలు చేసిన సూచన మేరకు ఈటల రాజేందర్‌ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన అస్సాం రాజధాని గౌహతి వెళ్లారు. తనవెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని తీసుకెళ్లారు. అక్కడ ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మతో వారు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తదితరాల గురించి వారి మధ్య చర్చకు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో తెలంగాణలో బలపడాలంటే పార్టీలో చేయాల్సిన మా ర్పులు, చేర్పుల గురించి ఈటల తన వైఖరిని స్పష్టంగా చెప్పినట్టు సమా చారం. పార్టీలో ఈటల ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను గమనం లోకి తీసుకున్న కొద్దిమంది సీనియర్‌ నేతలు హిమంత బిశ్వశర్మతో షేర్‌ చేసుకోవాల్సిందిగా సూచించారనీ, దానికి తగిన ఏర్పాట్లు చేయడంతోనే హఠాత్తుగా ఆయన శుక్రవారం ఉదయం గౌహతికి వెళ్లారని ప్రచారం జరు గుతున్నది. రాత్రికి అక్కడే ఉండి శనివారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఈటల రాజేందర్‌ అస్సోం పర్యటనకు వెళ్లగా…బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మాత్రం ఖమ్మం నగరానికి వెళ్లారు. ఈ నెల 15న ఖమ్మంలో హోం శాఖ మంత్రి అమిత్‌షా పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఖమ్మం జిల్లాలో బీజేపీ ప్రభావం నామమాత్రమే.

Spread the love