ప్రజల జీవితాల్లో మార్పు కాంగ్రెస్‌తోనే సాధ్యం

– తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల బాధలు పోలే :ఆవిర్భావ దినోత్సవంలో లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల బాధ అర్థం చేసుకున్న సోనియాకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేశారనీ, వారి సమస్య ఎవరూ వినలేదన్నారు. సోనియా మాత్రమే తెలంగాణ ప్రజలను అర్థం చేసుకున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన మీరాకుమార్‌… శుక్రవారం గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద నివాళులుర్పించారు. ఈ సందర్భంగా జై తెలంగాణ అంటూ నినదించారు. అక్కడి నుంచి బాబూ జగ్జజీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత నిజాం కళాశాల మీదుగా మెహింజారు మార్కెట్‌ నుంచి గాంధీభవన్‌కు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని మీరాకుమార్‌ ప్రారంభించారు. అనంతరం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో మీరాకుమార్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజల బాధలు చూసి రాష్ట్ర ఏర్పాటు చేశామన్నారు. రాజ్యాంగ పరిధిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్ల గడిచినందుకు సంతోషంగా ఉందన్నారు. పరిస్థితులు మారనందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ నుంచి కాస్త పక్కకి వెళ్లి చూస్తే తెలంగాణలో ఉన్న పరిస్థితులు తెలిసాయన్నారు. ఇక్కడి ప్రజల బాధలను మార్చేందుకు కాంగ్రెస్‌ కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. అందు కోసం ఎప్పుడు పిలిచినా రాష్ట్రానికి వస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీసుకురావాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉండాలంటే, కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. ‘నాకు తెలుగులో మాట్లాడాలని ఉంది. తెలుగు భాష చాలా అందంగా ఉంటుంది. మా నాన్న ఇక్కడికి వచ్చేవారు. అప్పటి నుండే నాకు తెలుగుతో అనుబంధం ఉంది. ఈ వేదికపై విప్లవకారులు కూర్చున్నందుకు ఈ వేదిక వెలిగిపోతోంది’ అని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ తెలంగాణలో యువత ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రైతులు పలు సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10వ ఏట అడుగుపెడుతున్న తెలంగాణ ప్రజలకు ఆయన దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రాష్ట్రంలో అంత సులువుగా ఏర్పడ్డ రాష్ట్రం కాదన్నారు. 60 ఏండ్లపాటు రగిలిన ఉద్యమ అగ్నిగోళం అని తెలిపారు. 1200 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిందన్నారు. తెలంగాణ ఇచ్చిపదేండ్లు అవుతున్నా…మన బతుకులు మారలేదని తెలిపారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ అసమానతలు ఉన్న ప్రాంతాల్లో తిరుగుబాటు వస్తుందన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం వెనక సోనియాగాంధీ కృషి ఎంతో ఉందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి గంట పాటు సోనియా గాంధీకి వివరించినట్టు గుర్తు చేశారు. బహిరంగ సభలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మెన్‌ దామోదర్‌ రాజానర్సింహ, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్‌ యాదవ్‌, బలరాం నాయక్‌, పొన్నంప్రభాకర్‌, సిరిసిల్ల రాజయ్య, సురేష్‌ షెట్కార్‌, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, నదీమ్‌ జావిద్‌, రోహిత్‌ చౌదరి, జి. నిరంజన్‌, సంగిశెట్టి జగదీశ్వర్‌ తదితరులు. పాల్గొన్నారు. సభ ప్రారంభంలో ప్రజాగాయకుడు గద్దర్‌ తెలంగాణ పాట పాడి ఉత్సాహాన్ని నింపారు. మీరాకుమార్‌ బోనం ఎత్తారు. అనంతరం పలువురు తెలంగాణ ఉద్యమకారులను ఆమె సన్మానించారు.

Spread the love