మంత్రి సబితకు ఏఐఎస్‌ఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇంజినీరింగ్ కాలేజీల్లో డొనేషన్ల పేరుతో విద్యావ్యాపారాన్ని నియంత్రించా లని కోరారు. రాష్ట్రంలో విద్యావ్యాపారం చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య పేరుతో రూ.లక్షలు దోచుకుంటు న్నాయని విమర్శించారు. నియంత్రణకు చట్టాలున్నా వాటిని అమలు చేయడంలో విద్యాశాఖ అధికారులు విఫలమవుతున్నారని తెలిపారు. ఎలాంటి నిబంధ నలు పాటించకుండా విద్యార్థులకు మౌలిక సదుపా యాలు కల్పించకుండా అనుమతుల్లేకుండా విద్యాసంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై విచారణ జరపాలని సూచించారు. ఆ వర్సిటీ వీసీ రవీందర్‌గుప్తా అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయారని విమర్శించారు. ఈసీ నిర్ణయాలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో సొంత నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.