నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లోని మథురలో ఘోర ప్రమాదం జరిగింది. యమునా ఎక్స్ ప్రెస్ వేపై బస్సు- కారు ఢీకొని ఐదుగురు చనిపోయారు. మహావన్ దగ్గర యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై డివైడర్ ను బస్సు ఢీకొట్టింది. వెంటనే బస్సును కారు ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి. కారులోని ఐదుగురు సజీవదహనం అయినట్లు తెలిపారు అధికారులు. కాగా.. బస్సులోని వారందరూ మంటలు వ్యాపించకముందే తప్పించుకున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది వాహనాల నుంచి చెలరేగిన మంటలు ఆర్పారు. బస్సు టైరు పేలిపోవడంతో.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు మథుర ఎస్పీ శైలేష్ పాండే. చనిపోయిన వారిలో ఒకరిని గుర్తించామని.. మిగతా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.