వేసవి తాపానికి..?

వేసవిలో బయటికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. చిన్న పిల్లల్ని, పెద్దవాళ్లని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటికెళ్లొచ్చిన వెంటనే రీహైడ్రేట్‌ అవ్వాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే సరి… అవేంటంటే…
– శరీరాన్ని హైడ్రేట్‌ చేసే నీటితో కొంత వరకు ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
– మితమైన మోతాదులో కాఫీ, టీలతో శరీరానికి శక్తి వస్తుంది. అలాగే బాదంపాలు, టీలో దాల్చినచెక్క, లెమన్‌గ్రాస్‌, జాజికాయ వంటివి చేర్చడం ద్వారా హైడ్రేట్‌ అవొచ్చు.
– పాలల్లో అధిక ఎలక్ట్రోలైట్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలోని నీటినిల్వలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడతాయి.
– కొన్ని పండ్లు, కూరగాయల్లో 80-90 శాతం నీరు ఉంటుంది. డీహైడ్రేట్‌ అయ్యేటప్పుడు పండ్ల రసాలవల్ల ఉపశమనం పొందొచ్చు. విటమిన్‌ సి ఉన్న పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనిస్తే సత్వర ఫలితాన్ని పొందొచ్చు.
– సమస్య ఎక్కువై వాంతులు, విరేచనాలు వంటివి వస్తే… ఓరల్‌ హైడ్రేషన్‌ సొల్యూ షన్స్‌ వినియోగించాలి. ఇందులో ఎక్కువ శాతం సోడియం, క్లోరైడ్‌, ఎలక్ట్రోలైట్స్‌ ఉండటం వల్ల అలసట, నీరసం తగ్గుతాయి.
– ఇవి అందుబాటులో లేనప్పుడు లీటర్‌ నీళ్లలో, 6చెంచాల చక్కెర, అర చెంచా ఉప్పు కలిపి తాగితే ఎండదెబ్బ నుంచి బయటపడొచ్చు.

Spread the love