మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని సవరించాలి.. 

– అటోవాలలకు 3వేలు అందజేయాలి. డిఎస్పీ డిమాండ్…
నవతెలంగాణ- డిచ్ పల్లి
డిసెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. కానీ ఈ ఉచిత ప్రయాణంలో చాలా అనర్ధాలు, నష్టాలు ఉన్నాయని, అందుకని హేతుబద్ధంగా ఈ ఉచిత ప్రయాణాన్ని సవరించాల్సి ఉందని దానికోసం రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ కొన్ని సూచనలు అమలు చేసే విధంగా డిమాండ్లను ముందుంచమని ధర్మజమజ్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ అన్నారు.డిఎస్పి అధినేత డాక్టర్.విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు శనివారం ఇందల్ వాయి తహసిల్దార్ వెంకట్రావు కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ  బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద మహిళలకు మాత్రమే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నెలకు లక్ష రూపాయలు సంపాదించే మహిళా ఉద్యోగస్తుల కు ఉచిత ప్రయాణాన్ని వర్తింప చేయవద్దని,ఉచిత ప్రయాణం ప్రభావం ఆటో కార్మికుల పై పడుతుందని, తద్వారా ఆటో కార్మికులకు తీవ్ర నష్టానికి గురవుతున్నారని, ఈ నష్టాన్ని భరించడానికి ఆటో నడిపే కార్మికుడికి నెలకు ₹3,000 చొప్పున ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సాయిలు, రంజిత్, రవి, అరుణ్, వంశీ, గణేష్, రమేష్ పాల్గొన్నారు.
Spread the love