ప్రభుత్వ కళాశాలలను  సద్వినియోగ పరుచుకోవాలి 

నవతెలంగాణ-రామగిరి : ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీం అన్నారు. శుక్రవారం రామగిరి మండలంలోని నాగేపల్లి, బేగంపేట  జడ్పీ హెచ్ ఎస్  పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ, అందుబాటులో ఉన్న బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్లో చేరితే చదువుతో పాటు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఉచిత విద్యతో పాటు ఉపకార వేతనాలు, అకాడమీ పుస్తకాలు అందివ్వడం జరుగుతుందన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న తమ కళాశాలలో చేరి బంగారు భవష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నరు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు  హైమవతి ,  మేరీ, అధ్యాపకులు ఝాన్సీ, శ్రీధర్ రావు,  తిరుమల్, ఎల్ ఆర్ కే రెడ్డి, శ్రీదేవి, పాల్గోన్నారు.
Spread the love