హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

నవతెలంగాణ-హైదరాబాద్‌: నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్‌, తుర్కయాంజల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, ముషీరాబాద్, విద్యానగర్, రాంనగర్, బాగ్ లింగంపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వర్షం కురిసింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

Spread the love