ఇంటి వైద్యం

పసుపు : జలుబు, రొంప చేసినప్పుడు వేడి వేడి పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. పసుపుకొమ్మును కాల్చి, ఆ పొగను పీలిస్తే ముక్కుదిబ్బడ నయమవుతుంది.
పసుపుముద్దను పుదీనా రసంలో కలిపి, రాత్రి పడుకునేప్పుడు మొటిమలపై రాస్తే కొన్నాళ్లకు అవి తగ్గిపోతాయి. బహిష్టు తర్వాత పసుపు, తేనె, నెయ్యి కలిపి సేవిస్తే గర్భాశయ శుద్ధి కలుగుతుంది.
పసుపుకు యాంటీసెప్టిక్‌ గుణం కలిగి ఉంది కనుక గాయాలపై రాస్తే రక్తస్రావం ఆగిపోయి, గాయం త్వరగా మానుతుంది.

ధనియాలు: ధనియాల చూర్ణాన్ని పటికబెల్లంతో కలిపి తింటే అరుచి, అజీర్ణం, గొంతునొప్పి, జలుబు, రొంప తగ్గుతాయి.
గర్భిణులకు వాంతులు తగ్గుతాయి. కషాయం తాగితే అధిక రక్తపోటు తగ్గుతుంది.
ధనియాలు, కరివేపాకు, చింతచిగురులను ఎండబెట్టి పొడి చేసి, స్వల్ప ప్రమాణంలో సైంధవలవణం కలిపి ఆవునెయ్యితో అన్నం మొదటిముద్దతో తింటే సమస్త జీర్ణకోశవ్యాధులు తగ్గుతాయి.

Spread the love