ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి అనుమతి తీసుకోకుంటే కూల్చివేత తప్పదు

– ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణ పనులను పరిశీలించిన డీఎల్‌పీవో
నవతెలంగాణ-నర్సంపేట

అనుమతి తీసుకోకుంటే ఫంక్షన్‌ హాల్‌ను కూల్చే యాలని డీఎల్‌పీవో వెంకటేశ్వర్లు పంచాయతీ కార్యద ర్శిని ఆదేశించారు. శుక్రవారం మండలంలోని రాము లునాయక్‌ తండా పరిధిలోని నర్సంపేట-వరంగల్‌ రోడ్డులో అనుమతి లేకుం డా నిర్మాణం చేపడుతున్న ఫంక్షన్‌హాల్‌ను డీఎల్‌పీవో సందర్శించారు. ఈ సంద ర్భంగా ఎస్సారెస్పీ కాల్వ ఆ క్రమణ, నిర్మాణ పనులను పరిశీలిచారు. ఎలాంటి అ నుమతులు లేకుండా ఫం క్షన్‌ హాల్‌ను ఎలా నిర్మిస్తు న్నారని యజమాని డాక్టర్‌ రాజారాంపై డీఎల్‌పీవో ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుమతులు లేకుండనే ని ర్మాణం తుదివరకు వస్తుంటే మీరేం చేస్తున్నారని కా ర్యదర్శి శ్రవణికుమారిని మందలించారు. పంచాయ తీరాజ్‌ చట్టప్రకారం ముందుగా నాలా పర్మిషన్‌, తగి న డాక్యూమెంట్‌ల ఆధారంగా గ్రామ పంచాయతీకి ధరఖాస్తు చేసుకోవాలని తదుపరి డీటీసీపీ అనుమతి ఇచ్చినట్లయితే తీర్మాణం మేరకు నిర్మాణానికి అనుమ తి ఇస్తామన్నారు. ఇవేమి లేకుండానే ఫంక్షన్‌హాల్‌ నిర్మాణం చేయడం నిబంధనలను అతిక్రమించినట్లే అవుతుందన్నారు. పక్కనే ఉన్న ఎస్సారెస్పీ కాల్వ ఆక్ర మించి నిర్మాణం చేస్తున్నట్లు అభ్యంతరాలు ఉన్నాయ ని సెట్‌బ్యాక్‌ లేకుండా కట్టడాలకు అనుమతి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. నిర్మాణదారుడు 15 రోజులు గడువు ఇవ్వాలని కోరగా అప్పటి వరకు పనులను నిలివేయాలని, నిర్ణీ త గడువులోపు అనుమతి తీసుకోకుంటే కట్టడాలను కూల్చివేయాలనిపంచాయతీ కార్యదర్శి శ్రవణి కుమా రిని ఆయన ఆదేశించారు.

Spread the love