ఎర్రజెండా తగ్గిందంటే అది మరింత ముందుకు పోతుంది

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ – బోనకల్‌
ఎర్రజెండా కొంత తగ్గిందంటే అది మరింత బలంగా పెరిగి ముందుకు దూసుకుపోతుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని చొప్పకటపాలెం గ్రామంలో సిపిఎం సీనియర్‌ నాయకులు అమరజీవి తన్నీరు జగ్గయ్య 35వ వర్ధంతిని సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా తన్నీరు జగ్గయ్య స్థూపానికి పొన్నం వెంకటేశ్వరరావు సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు ముష్టికుంట్ల జోన్‌ బాధ్యులు బంధం శ్రీనివాసరావు సిపిఎం మండల కమిటీ సభ్యులు కందికొండ శ్రీనివాసరావు, కీలార్‌ సురేష్‌ పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం స్థూపం వద్ద సిపిఎం పతాకాన్ని పొన్నం వెంకటేశ్వరరావు ఎగరవేశారు. అనంతరం బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో పొన్నం మాట్లాడుతూ తన్నీరు జగ్గయ్య, నేను మధిర నియోజకవర్గ ప్రారంభంలో కలిసి పని చేసామని తెలిపారు. మధిర నియోజకవర్గ నుంచి రాజకీయ క్లాసులకు తాము ఇద్దరం మాత్రమే వెళ్ళామని తెలిపారు. జగ్గయ్య మధిర నియోజకవర్గంలో సిపిఎం అభివృద్ధికి అనేక సంవత్సరాలు పాటు కషి చేశాడని తెలిపారు. అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగిన పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు. జగ్గయ్య లాంటి వ్యక్తి అతి తక్కువ వయసులోనే మృతి చెందటం నియోజకవర్గం లో పార్టీకి తీరని లోటు అన్నారు. జగ్గయ్య మతి చెంది 35 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా ప్రజా హదయాలలో నిలిచిపోవడం గర్వకారణం అన్నారు. ఆయన చూపిన పోరుబాటలో మనమందరం నడవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవటమే వాము పక్షాల లక్ష్యమని అందుకోసమే బీఆర్‌ఎస్‌ తో కలిసి పని చేయాల నిర్ణయించినట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వర్ధంతి సభలో సిపిఎం నాయకులు బోయినపల్లి పున్నయ్య, భూసి వెంకటేశ్వర్లు, చలమల హరి కిషన్‌ రావు, ఉన్నం వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు తన్నీరు పుల్లారావు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love