పాలమూరుపై చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేయాలి

– అభివృద్ధిపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదు
– ఓటమి భయంతో రేవంత్‌రెడ్డికి మతిభ్రమించింది
– మహిళలంటే రేవంత్‌రెడ్డికి చిన్న చూపు
– రాష్ట్ర ముఖ్యమంత్రా రేవంత్‌రెడ్డి భాష చూస్తుంటే ముఖ్యమంత్రి లేక ప్రతిపక్ష నాయకుడు
– పాలమూరు ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందే నేను : డీకే అరుణ
నవతెలంగాణ-కోడంగల్‌
పాలమూరు అభివృద్ధిపై డీకే అరుణకు చిత్తశుద్ధి ఉందని పాలమూరు అభివద్ధి కోసం అనేక పోరాటాలు చేశానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అని చెప్పుకోవడం తప్ప జిల్లాలో ఉన్నది లేదు అభివృద్ధి చేసింది లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కోడంగల్‌లోని బీజేపీ నాయకులు పూనం చంద్‌ లాహౌటి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కోస్గి, దౌల్తాబాద్‌, మద్దూర్‌, గుండు మాల్‌, బోంరాస్‌పేట్‌ మండలాలలో ప్రచారం నిర్వహించామని ప్రజల నుంచి పెద్ద ఎత్తున బీజేపీని స్వాగతిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అహంకారంతో విర్రవీగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మహిళల పట్ల ఆయనకు చిన్నచూపు ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడం చూస్తుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేక ప్రతిపక్ష నాయకుడా అర్థం కావడం లేదన్నారు. మహిళల పట్ల అసభ్య పదజాలంతో దుర్భుషలాడుతూ అగౌరవంగా మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటున్నారు పాలమూరు కోసం ఏమీ అభివద్ధి చేశారో చెప్పాలన్నారు. పాలమూరు అభివద్ధి విషయంలో నాపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. రేవంత్‌ రెడ్డి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్నప్పుడు కోడంగల్‌ అభివద్ధి కోసం కళాశాలలు, సబ్‌స్టేషన్ల్లు, రోడ్లు అనేక అభివద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. కోడంగల్‌ నియోజకవర్గానికి రేవంత్‌ రెడ్డి చేసింది ఏమీ లేదన్నారు. బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్‌ సాగర్‌ వాటి పట్ల ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం చేస్తుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసిన చరిత్ర డీకే అరుణది అన్నారు. ప్రాజెక్టుల కోసం గద్వాల నుండి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేశానని నిరాహార దీక్షలు చేశానని గుర్తు చేశారు. ఆర్డీఎస్‌ కోసం రాయలసీమ రైతులు వేటకుడవళ్ళు బరిసెలు. గుడ్డలతో రాళ్లు పట్టుకొని ఎదురు నిలబడితే వెనక్కి తగ్గకుండా పోరాటం చేశానన్నారు. ఇప్పుడు విమర్శించే వాళ్ళందరూ ఆనాడు ఎక్కడ పోయారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజలకు సేవ చేసిన అనుభవంగాని. మంత్రిగా సేవ చేసిన అనుభవం గానీ లేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏర్పాటు కోసం జీవో విడుదల చేయించిందేనినన్నారు. జూరాల నుంచి మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కషి చేయాలన్నారు. అడ్డగోలు దోపిడి కోసం కేసీఆర్‌ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ మారిస్తే పోరాటం చేసింది డీకే అరుణ కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం కాదు పాలమూరు రంగారెడ్డి గురించి పార్లమెంటులో ఏనాడైనా ఒక రోజైనా మాట్లాడారా అన్నారు. డీకే అరుణ మహబూబ్‌నగర్‌కు చేసింది ఏమీ లేదు తన కుటుంబంలో మాత్రం పదవులు వచ్చాయని రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని తన కుటుంబంలో ఎవరికి పదవులు వచ్చాయో చెప్పాలన్నారు. పాలమూరు అభివద్ధి విషయంలో డీకే అరుణతో పోటీ పడలేక డీకే అరుణపై ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కోడంగల్‌ నియోజకవర్గం అభివద్ధి కోరుకోవడం లేదని కోడంగల్‌ వెనుకబాటు ఉంటేనే ప్రజలని మోసం చేసి ఎన్నికలలో గెలవచ్చనే భ్రమలో ఉన్నారన్నారు. కోడంగల్‌ నుండి హైదరాబాద్‌. భూత్పూర్‌ నుండి చించోలి రోడ్డు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. వికారాబాద్‌ కష్ణ రైల్వే లైన్‌కు నిధులు మంజూరు చేయించింది డీకే అరుణ అన్నారు. పాలమూరు యూనివర్సిటీకి వంద కోట్లు నిధులు కేటాయించామన్నారు. కార్యక్రమంలో ప్రతాప్‌రెడ్డి, నాగురావ్‌ నామోజీ, కొడంగల్‌ పట్టణ అధ్యక్షుడు సర్వేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love