తస్మత్‌ జాగ్రత్త

– కమలానికి ఓటు వేస్తే..రిజర్వేషన్లు పోతవి
– దళిత, గిరిజన, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతది
– అందుకే బీజేపీని ఓడించండి
– కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించండి
– ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
– చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం
– రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాతీయ ప్రతినిధి/తాండూర్‌ రూరల్‌
దేశంలో బడుగు, బలహీన వర్గాలకు తోడుగా ఉన్న రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తాదంట. ఇలాంటి పార్టీకి ఓటు వేసి తమ హక్కులను కాలరాసుకోవద్దని చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూర్‌లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున్న ర్యాలీ చేపట్టారు. బైక్‌ర్యాలీలతో హోరెత్తించారు. అనంతరం ఏర్పాట్లు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో రంజిత్‌రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల రద్దు చేసి మనుధర్మాని అమలు చేయాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెండాను బీజేపీ అమలు చేసేందుకు సిద్ధమైదన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లు సాధిస్తే, పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్‌లను రద్దు చేయొచ్చని బీజేపీ భావిస్తోందన్నారు. అందుకే ఈసారి 400కు పైగా ఎంపీ సీట్లు సాధిస్తామంటూ ఆ పార్టీ నేతలు ఉదరగొడుతున్నారని వివరించారు. అదే జరిగి బీజేపీ బంపర్‌ మెజారిటీతో అధికారం లోకి వస్తే, రాజ్యాంగాన్ని మార్చటం ఖాయమనీ, దాంతో రిజర్వేషన్లు ఇక మరిచి పోవాల్సిందేనన్నారు. రిజర్వేషన్లు రద్దు అయితే దేశంలో మళ్లీ బానిసత్వం తప్పదన్నారు. బీజేపీకి ఓట్లు వేసి బానిసలు అవుతారా… కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటా ఆలోచన చేయాలని రంజిత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై, కాంగ్రెస్‌ జెండా ఎగరవేస్తామని తాండూర్‌ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పాలనలోని బడుగు బలైన వర్గాలకు అభివృద్ధి జరిగిందన్నారు. పదేండ్ల బీజేపీ పాలనలో, అంబానీ ఆధానిలు అభివృద్ధి చెందారు తప్ప, ఏ ఒక పేద కుటుంబానికి లబ్ధి చేకురింది లేదన్నారు. జన్‌ధన్‌ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు వేస్తామని మోడీ చిల్లి గవ్వకుడ వేయలేదన్నారు. మోడీ మాటలు గాలిలో మేడలు కట్టినట్లే ఉంటాయన్నారు. ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలో తీసుకురావాలంటే.. చేవెళ్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి గెలిపించి పార్లమెంటుకు పంపిచాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్ర మంలో మల్కాపూర్‌ గ్రామం మాజీ సర్పంచ్‌, విజయలక్ష్మి పండరి, ఎంపీటీసీ రవి సిండే, రఘునాథ్‌రెడ్డి, జనార్దన్‌ రెడ్డి, నర్సింలు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు నాగప్ప, డీసీసీబీ డైరెక్టర్‌, రవీందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, వడ్డే శ్రీనివాస్‌, నాయకులు మేఘనాథ్‌ గౌడ్‌, రాము యాదవ్‌, హరీష్‌రెడ్డి, గోపాల్‌, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, నర్సింలు, రాజు పటేల్‌, శరణు బసప్ప, రాజ్‌కుమార్‌, జర్నప్ప సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love