కట్టుకున్న భర్త ను హతమార్చిన అక్రమ సంబంధం 

– ప్రియుడి మోజులోపడి పథకం ప్రకారం హత్య 
– అనుమానంతో పోలీసులను ఆశ్రయంచిన మృతుడి సోదరుడు
– కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు 
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
అక్రమ సంబంధానికి కట్టుకున్న భర్త అడ్డువస్తున్నా డని ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను పథకం ప్రకారంహతమార్చింది ఓ భార్య .ఈ సంఘటన సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ భూంపల్లి మండల పరిధిలోని రామేశ్వరం పల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం రామేశ్వరం పల్లి గ్రామానికి చెందిన మైలీ నవీన్ కుమార్ (37). వృత్తి రీత్యా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గత 13 సంవత్సరాల క్రితం చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ఉదయరాణితో వివాహం కాగా వారికీ మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. మృతుడు నవీన్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా అతడి భార్య పక్కింటి అబ్బాయి శ్యామ నాగరాజు అలియాస్ తరుణ్ (23)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కాస్త దుబాయ్ నుంచి వచ్చిన భర్తకు తెలవడంతో భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు మొదలయ్యాయి. ఎలాగైనా నవీన్ ను హతమార్చాలని ప్రియుడితో కలిసి మృతుడి భార్య నిర్ణయించుకున్నారు. ఇదే  అదునుగా భావించి  పథకం ప్రకారం నాగరాజు ఆదివారం రాత్రి  నవీన్ కు గ్రామ శివారులో మద్యం తాగించాడు. ఇంటికి వస్తున్న క్రమంలో తాగి ఉన్న నవీన్ నెత్తికి,ముఖానికి దెబ్బలు తగలగా…  నాగరాజు రాత్రి 11:30 సమయంలో నవీన్ ను ఇంటిలో వదిలేసి వెళ్ళిపోయాడు. నవీన్ పడుకున్నాక మృతుడి భార్య ఉదయ రాణి 12 గంటలకు ప్రియుడికి పొన్లో మెసేజ్ చేసి రమ్మంది.అనంతరం వారిద్దరూ కలిసి నవీన్ చేతులు కట్టేసి ఇంటి ఆవరణలో ఉన్న సంపులో 20 నిమిషాలు ముంచి హత్య చేశారు. చనిపోయాడని నిర్ణయించుకున్నాక బట్టలు మార్చి మృతుడి అన్నకు సమాచారం ఇచ్చింది. అనుమానం వచ్చిన మృతుడి అన్నయ్య పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం సంఘటన స్థలానికి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ, భూంపల్లి ఎస్సై భువనేశ్వర్ రావ్, పోలీస్ సిబ్బందితో కలిసి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుని ఫిర్యాదు  మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love