రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రఘునందన్ రావ్ ఇంటికే

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : మెదక్ ఎంపీ  ఆదేశానుసారం  సోమవారం తాళ్లపల్లి గ్రామంలో బీఆర్ ఎస్ పార్టీ, విద్యార్థి విభాగం, యువజన విభాగం, సోషల్ మీడియా విభాగాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాళ్ళపల్లి గ్రామ యువత అధ్యక్షునిగా అవునూరి నరేష్,సోషల్ మీడియా అధ్యక్షుడి గా కాసులబాద్ నాగరాజు, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా గోపరి అశోక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జ్ పాపని సురేష్ గౌడ్,దుబ్బాక మండలపార్టీ మాజీ అధ్యక్షుడు టేకులపల్లి మల్లా రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోడోల్ల దేవరాజ్  మాట్లాడుతూ….బీజేపీ నాయకులు చేస్తున్న అసత్యపు, అబద్ధపు ప్రచారాలు ఎప్పటికప్పుడు ఎండగట్టుతు బీజేపీ నాయకులను గ్రామాలలో అడ్డుకునేందుకు నిలదీస్తామని హెచ్చరించారు.2023-2024 సార్వత్రిక ఎన్నికలలో రఘునందన్ రావు ని ఇంటికి పంపడమే లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో ప్రతీ ఇంటికి చేరవేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇంచార్జ్ లు దమ్మగౌని ప్రశాంత్ గౌడ్,ఎర్రోళ్ల రాజు,  పార్టీ అధ్యక్షుడు చౌదర్పల్లి శ్రీనివాస్, టెలికాం బోర్డ్ మెంబెర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్ , కూడవెళ్లి పాలక మండలి సభ్యుడు పాతూరి తిరుపతి గౌడ్, సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ యాదగౌడ్, రైతు సమన్వయ కమిటీ మెంబర్ వేల్పుల నర్సింలు, వార్డ్ సబ్యులు జైపాల్ రెడ్డి,పాతూరి దుబ్బగౌడ్,గోపరి నర్సింలు,గోపరి బాలయ్య , బొమ్మరపు ఎల్లం, పాతూరి భాను,పెద్దోల్ల స్వామి,గోదా రాజు,గోద తిరుపతి,వేల్పుల శేఖర్,వేల్పుల సతీష్,వేల్పుల ఆంజనేయులు,గోషికే రాము,గోపరి బాలు,గోపరి కిష్టయ్య,గోపరి కనకరాజు,గోద స్వామి ,గోద దేవయ్య,గోషికే రవి,పాతూరి సాయి కిరణ్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.
Spread the love