ఇస్లామా బాద్: అమత్‌సర్ నుంచి అహ్మ దాబాద్‌కు బయలుదేరిన ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. లాహౌర్ సమీపంలోని గుజ్రాన్‌వాలా వరకూ దూసుకెళ్లింది. 30 నిమిషాల తరువాత సురక్షితంగా మన గగనతలంలోకి వచ్చేసింది. ఈ మేరకు ఆదివారం విమానయాన సంస్థ వెల్లడించింది. విమాన రాడార్ వివరాల ప్రకారం.. భారత విమానం శనివారం రాత్రి 7.30 గంటలకు ఉత్తర లాహౌర్ ప్రాంతంలోకి ప్రవేశించింది. రాత్రి 8 గంటలకు భారత్‌కు తిరిగివచ్చేసింది. ఈ వ్యవహారంపై అమత్‌సర్ ఏటీసీ టెలిఫోన్ ద్వారా పాకిస్థాన్‌తో చక్కటి సమన్వయం సాగించింది.