స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ పనులు పరిశీలన

నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
వికారాబాద్‌ పట్టణంలోని వివిధ వార్డుల్లో జరిగిన స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ పనులను గురువారం వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల రమేష్‌ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణాలు, మున్సిపాలిటీలు మరింత పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ పనులను చేపట్టినట్టు చెప్పారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమ వారోత్సవాల సందర్భంగా వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 3,14,17, 28వ వార్డుల్లో చైర్‌పర్సన్‌ పర్యటించారు. జేసీబీ సహాయంతో వార్డుల్లో అక్కడక్కడ చాలా రోజులుగా పేరుకుపోయిన చెత్త, కలుపు మొక్కలు, పాతబడిన ఇండ్లు లేదా గోడలు తీసేయడంలాంటి పనులు ప్రణాళికంగా నిర్వహించాలని సంబంధిత అధికారును ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్‌ మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌ కుమార్‌, స్థానిక కౌన్సిలర్లు మోముల స్వాతిరాజ్‌ కుమార్‌, చింతకింది రామస్వామి, నాయకులు మోముల రాజ్‌ కుమార్‌, హసీబ్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మొహీనుద్దీన్‌, సూపర్‌వైజర్‌ తబిత, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు, జవాన్లు, పారిశుధ్య సేవకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love