వచ్చేనెల 24 నుండి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. వచ్చే నెల 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం ప్రకటించారు. కాసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం. సెకండ్ ఇయర్ లో ములుగు ప్రథమ స్థానం లో ఉందన్నారు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి మెమోలు అందుబాటులో ఉంటాయన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 2 వరకు రీ వెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు ఉంటుందన్నారు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం. వచ్చే నెల 24 నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం.

Spread the love