వస్తువుల సరఫరాకు టెండర్లు ఆహ్వానం : పీఓ

నవతెలంగాణ-భద్రాచలం
2023-24 విద్యాసంవత్సరమునకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గల స్కూల్స్‌, హాస్టల్స్‌కు అవసరమైన కోడిగుడ్లు, కూరగాయలు, అరటి పండ్లు, స్కిన్లెస్‌ చికెన్‌, పాలు (టెట్రా) సరఫరా చేయుటకు ఆసక్తిగల అమ్మకం దారుల నుంచి షీల్డ్‌ టెండర్లు కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్‌ పోట్రు ఒక ప్రకటనలో తెలిపారు. డీడీ (టిడబ్ల్యూ) భద్రాచలం వారి పేరున డీడీ ద్వారా ఎస్‌బిఐ బ్యాంకులో రూ.2000 టెండర్‌ ఫారం ధర, కూరగాయలు రూ.40 వేలు, పండ్లు రూ.25000, గుడ్లు రూ.45000, స్కిన్లెస్‌ చికెన్‌ రూ.40 వేలు, పాలు (టెట్రా) రూ.40000, డిపాజిట్‌ చెల్లించి ఈనెల 29 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు టెండర్‌ ఫారంలు డీడీ (టిడబ్ల్యూ) భద్రాచలం కార్యాలయంలో పొందవచ్చునని ఎస్సీ, ఎస్టీ సరఫరాదారులకు ధరావత్‌ డిపాజిట్లు 40 శాతం రాయితీ కలదని, వచ్చే నెల మూడో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు టెండర్‌ ఫారాలు సమర్పించాలని ఆయన తెలిపారు. పాన్‌ కార్డు, టిన్‌ కార్డ్‌ నెంబర్లు సొంత దుకాణం, బ్యాంకు ఖాతా కలిగి భద్రాద్రి జిల్లాకు చెందినవారై ఉండాలని, వచ్చే నెల ఎనిమిదో తేదీ ఉదయం 11 గంటలకు సీల్డ్‌ టెండర్స్‌ తెరిచి ప్రాజెక్ట్‌ అధికారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.

Spread the love