రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయాలి

– అధికారులకు కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశాలు
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో దిగ్విజయంగా రంగ రంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశపు హాల్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్‌ రెండో తేదీ నుండి 22 వరకు శాఖల వారిగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తి చేసుకుని 10 సంవత్సరాల్లోకి అడుగుడుతున్న సందర్భంగా జిల్లా అంతటా పండుగ వాతావరణం రావాలని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తర్వాత సాధించిన ప్రగతి పై అన్ని శాఖల అధికారులు పైరకు తెలియజేసేందుకు కార్యచరణ తయారు చేయాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ ప్రభుత్వ ఇతర కార్యాలయాలను సిరీస్‌ లైట్లతో విద్యుత్కరించాలని ఆదేశించారు. మునిసిపాలిటీ ముఖద్వారాల్లో ఆర్చీలు, ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతతో నిర్వహిస్తుందని కార్యక్రమాలన్నీ విజయవంతం కావడానికి మైక్రో ప్లానింగ్‌ ఉండాలని చెప్పారు. పకడ్బందీ కార్యచరణ ఉండాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాలని చెప్పారు. రెండవ తేదీన అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఉంటుందని స్థూపాన్ని పూలతో ముస్తావించారని చెప్పారు. మైదానాన్ని పరిశుభ్రం చేయించాలని మున్సిపల్‌ కమిషనర్ను ఆదేశించారు. పంచాయతీ మండల జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని చెప్పారు. కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమానికి లోగోను ప్రదర్శింపచేయాలని చెప్పారు. దశాబ్ద రోజుల్లో శాఖల వారిగా లబ్ధి పొందిన వ్యక్తి వచ్చే సందేశాలను వినిపించాలని చెప్పారు. రెండో తేదీన ప్రారంభోత్సవం ప్రగతి మైదానంలో అమరవీల స్థూపం వద్ద నివాళులు జాతీయ పతాకావిష్కరణ ప్రభుత్వ విప్‌, రేగా కాంతారావు సందేశం ఉంటుందని మూడున తెలంగాణ రైతు దినోత్సవం 4న సురక్ష దినోత్సవం, 5న తెలంగాణ విద్యుత్‌ విజయోత్సవం, 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరు రా చెరువుల పండుగ 9న తెలంగాణ సంక్షేమ సంబరాలు 10న సుపరిపాలన దినోత్సవం పరిపాలన సంస్కరణ ఫలితాలు, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్‌, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న వైద్య ఆరోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న గిరిజన ఉత్సవం, 18న మంచినీళ్ల పండుగ, 19న హరితోత్సవం, 20న విద్యా దినోత్సవం, 21న ఆధ్యాత్మిక దినోత్సవం, 22న సంస్కరణ ఉంటుందని చెప్పారు. నిధుల కొరతలేదని ఏర్పాట్లు ఘనంగా చేయాలని చెప్పారు. పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. షెడ్యూల్లో సూచించిన విధంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు మిషన్‌ భగీరథ మంచినీటి ప్రాజెక్టు ప్రజలను సందర్శించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆవిర్భావం ముందు తర్వాత సాధించే ప్రగతిని ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. అస్తిత్వం నుండి అభివృద్ధి వైపు తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనప కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love