స్థానికేతరులు బొడ్రాయి ప్రతిష్ట చేస్తే అరిష్టమే

– ప్రతిష్టాపనకు స్ధానికులే అర్హులు : కమిటీ రద్దు చేయాలి
– ఎమ్మెల్యే భర్త హరిసింగ్‌ ఏక పక్ష నిర్ణయాలు మానుకోవాలి
– విలేకర్ల సమావేశంలో అఖిపక్ష, కుల, ప్రజా సంఘాల నేతలు
నవతెలంగాణ-ఇల్లందు
బొడ్రాయి ప్రతిష్టాపనకు తొలుత ఊరికి హద్దులుండాలి. ఈనాటికి మున్సిపాలిటీకి హద్దులే లేవు. ఎమ్మెల్యే భర్త హరిసింగ్‌ ఏక పక్ష నిర్ణయాలు మానుకోవాలని అఖిపక్షం, ప్రజలు, ఇతర సంఘాల సమావేశాలు, సలహాలతోనే బొడ్రాయి ప్రతిష్టకు పూనుకోవాలని అఖిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. స్థానిక సత్రంలో శనివారం టీడీపీ పట్టణ అధ్యక్షులు వంశీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రేస్‌, న్యూడెమోక్రసీ, ప్రజాపంధా, బీజేపీ, టీడీపీ, తుడుందెబ్బ నేతలు అబ్దుల్‌ నబి, బంధం నాగయ్య, సుదర్శన్‌ కోరి, తుపాకుల నాగేశ్వరరావు, సారంగపాణి, మహేష్‌, ముద్రగడ వంశీ, నంద కిషోర్‌, తుడుందెబ్బ రాష్ట్ర నేత ఈసం నర్సింహారావు తదితరులు మాట్లాడారు. ఎంఎల్‌ఏ హరిప్రియ భర్త హరిసింగ్‌ నాయక్‌ల స్వంత ఊరు ప్రస్తుతం ఉండేది టేకులపల్లి మండలం. సంస్తృతి, సాంప్రదాయాలు, నిబంధనల ప్రకారం బొడ్రాయి ప్రతిష్ట స్దానికులైన ఇల్లందు పట్టణ వాసులే నిర్వహించాలన్నారు. అధికారం, హాదా ఉందని అన్నింటిని విస్మరించడం సరికాదన్నారు. మున్సిపాలిటీలోని 24 వార్డుల ప్రజలకు, అఖిపక్షానికి, వివిధ సంఘాలు, ప్రముఖులు, మేధావులకు చెప్పకుండా, సమావేశాలు నిర్వహించకుండా హరిసింగ్‌ నాయక్‌ ఒంటెద్దు పోకడలు పోవడం మానుకోవాలన్నారు. బొడ్రాయి ప్రతిష్టాపనకు కమిటి వేశారని అధికార పక్షానికి అనుకూలంగా ఉండేవారిని ఏరికోరి వేసుకున్నారని విమర్శించారు. అనుభవజ్జులైనవారు లేరని, కొందరికి చెప్పకుండానే పేర్లు రాశారని సమాచారం అందుతోందన్నారు.
ఎజెండా వేసుకుని అందరి మీద రుద్దడం సరికాదు
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి అబ్దుల్‌ నబి
ఎంఎల్‌ఏ భర్త హరిసింగ్‌ నాయక్‌ సొంతగా ఎజెండా వేసుకుని అందరి మీద రుద్దడం సరికాదు. ప్రజలు, అఖిలపక్షం అన్ని వర్గాల మద్దతు తీసుకోవాలి. అందకీ ఆమోదంతో పండుగలా నిర్వహించాలి. ఐక్య కార్యాచరణ అవసం. ఎంఎల్‌ఏ రూ.10లక్షలు ఇస్తే మిగతావి ఎక్కడి నుండి సమకూరుస్తారు.
ఏకపక్ష నిర్ణయాలు మానుకోండి : సీపీఐ పట్టణ కార్యదర్శి బంధం నాగయ్య
హరిసింగ్‌ నాయక్‌ ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలి. అకస్మాత్తుగా నిర్ణయాలు చేయడం ప్రజలకు ఇబ్బందికరం.
స్థానికేతరులు బొడ్రాయి ప్రతిష్ట చేస్తే అరిష్టమే : కాంగ్రేస్‌ పార్టీ సీనియర్‌ నేత సుదర్శన్‌ కోరి
బొడ్రాయి ప్రతిష్ట మంచి నిర్ణయమేనని కాని స్దానికేతరులు బొడ్రాయి ప్రతిష్ట చేస్తే అరిష్టం. వేసిన కమిటీలోను కులసంఘాల బాద్యులు లేరని అనామకులను నియమించడం సరికాదు. వేసిన కమిటినీ రద్దు చేయాలి.
అధికారం ఉందని నిర్ణయాలు సరికాదు : న్యూడెమోక్రసీ డివిజన్‌ కార్యదిర్శి నాగేశ్వరరావు
ఎంఎల్‌ఏగా అధికారం ఉందని సొంతగా నిర్ణయాలు చేయడం సరికాదు. బొడ్రాయి ప్రతిష్ట నిర్ణయం అఖిలపక్షం ఆద్వర్యంలో నిర్వహించాలి. రాజకీయ పార్టీలను విస్మరించడం సరికాదు.
రాజకీయ దురుద్దేశమే వ్యతిరేకిస్తున్నాం : బిజేపి నేత మహేష్‌
పట్టణానికి మున్సిపాలిటీకి సరిహద్దులు లేవు. హడాహుడిగా బొడ్రాయి ప్రతిష్టాపన నిర్ణయాలు మంచివి కావు. కమిటీలో క్వాలిటీ లేదు.
వేరే గ్రామానికి చెందినవారు బొడ్రాయి ప్రతిష్ట ఎలా చేస్తారు : తుడుందెబ్బ రాష్ట్ర నేత ఈసం నర్సింహారావు
24వార్డులో ప్రజలకు చెప్పలేదు. నిష్ట, సాంప్రదాయలు ఉంటాయి. బొడ్రాయి ప్రతిష్టపనకు ఊరు చుట్టూ మనుషులను పెట్టాల్సి ఉంటుంది. కనీసం ఆరు నెలలు పడుతుంది. హడాహుడి నిర్ణయాలు మంచిది కాదు.

Spread the love