విప్‌ రేగా విస్తృత పర్యటన

– పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు
నవతెలంగాణ-కరకగూడెం
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు శనివారం మండలంలో పలు గ్రామా పంచాయతీలో విస్తృతంగా పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. చిరుమళ్ళ రోడ్డు నుండి ఆశ్రమ పాఠశాల రోడ్‌, వట్టం వారి గుంపు రోడ్డు వయ ఆరెం వారి గుంపు వరకు సుమారు రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కరకగూడెం నుండి చిరుమళ్ల వరకు సుమారు రూ.2 కోట్లు 91 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫ్లడ్‌ డ్యామేజి, బీటీ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. మోతే గ్రామంలో పెద్దవాగుపైన సుమారు రూ.4 కోట్ల 50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆర్‌అండ్‌బి రోడ్డు నుండి గొల్లగూడెం వయా కొత్తూరు మధ్య (ముక్కోటి వాగుపైన) సుమారు రూ.2 కోట్ల 57 లక్షలతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా విప్‌ రేగా మాట్లాడుతూ పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని అని అన్నారు. రానున్న రోజుల్లో పినపాక నియోజకవర్గ రాష్ట్రంలో అగ్ర స్తానంలో నిలవాలని అన్నారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ పథకాలతో రాష్ట్రం పురోగతి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలవడం తెలంగాణ ప్రభుత్వ గొప్పతనం అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక, తహసీల్దార్‌ ఉషా శారద, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు నరసింహారావు, ఎంపీటీసీ ఎలిపెద్ది శైలజ, మునీంద్ర, బూర్గంపాడు మార్కెటింగ్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కొమరం రాంబాబు, మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, సీనియర్‌ నాయకులు రేగా సత్యనారాయణ, సంజీవరెడ్డి, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, సర్పంచులు, ఇరప్ప విజరు, బత్తిని నరసింహారావు, సరోజినీ, పాపమ్మ పోలబోయిన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love